సిద్దిపేటరూరల్: అధికారులు సమన్వయంతో జనగణన చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సెన్సెస్ – 2027 ప్రక్రియపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత జిల్లా అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. భారతదేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకు చేసినప్పటికి 2021లో కరోనా వైరస్ వల్ల జనగణన చేపట్టలేదన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జనాభా గణన చేయడం ఎనిమిదవదన్నారు. సెన్సెస్–2027 గణన ఫేస్–1 లో గృహాల జాబితా, ఫేస్–2 లో జనాభా జాబితాను సేకరిస్తారన్నారు. మొదటగా గృహ గణనపై తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మే నెలలో గృహాల జాబితా చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు గణనలో పాల్గొ ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సీపీఓ దశరథ్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ సెన్సెస్ అధికారి రమాదేవి పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
అధికారులకు దిశానిర్దేశం


