వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

వినతుల వెల్లువ

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

● సమస్యల పరిష్కారానికి ప్రజావాణి బాట ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ● వివిధ సమస్యలపై 169 దరఖాస్తులు

● సమస్యల పరిష్కారానికి ప్రజావాణి బాట ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ● వివిధ సమస్యలపై 169 దరఖాస్తులు

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో ప్రజల పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి బాట పడుతున్నారు. తమ గోడును విన్నవించుకునేందుకు ఉదయం 9గంటలకే జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 169 మంది వినతులను అందజేశారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ లతో కలిసి కలెక్టర్‌ హైమావతి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగ రాజమ్మ, ఏఓ రాజ్‌ కుమార్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

ట్రై సైకిల్‌

ఇప్పించండి సారూ..

మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నాకు.. ఒక రోజు ఎడుమ కాలుకు ఇన్ఫెక్షన్‌ వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్తే.. షుగర్‌ ఎక్కువ ఉండటం.. ఇన్ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో కాలును తొలగించారు. ఇటీవల నారాయణ సేవా సంస్థ వారు కృత్రిమ కాలు పెట్టించారు. కానీ నడవాలంటే ఇబ్బంది అవుతోంది. బ్యాటరీ ట్రై సైకిల్‌ ఇప్పించండి సారూ.. అని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా.

– వద్దిరాల ఐలయ్య, పందిళ్ల, హుస్నాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement