సమైక్యతకు ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

సమైక్యతకు ప్రతీక రంజాన్‌

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

● ఇఫ్తార్‌ విందుకు నాంది ఇక్కడే.. ● మాజీ మంత్రి హరీశ్‌రావు

● ఇఫ్తార్‌ విందుకు నాంది ఇక్కడే.. ● మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: ‘మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ నిలుస్తోంది. ఇఫ్తార్‌ విందు సిద్దిపేట ప్రాంతంలోనే మొదలైంది. సరిగ్గా 35 ఏళ్ల క్రితమే కేసీఆర్‌ స్వగ్రామమైన చింత మడకలో ప్రారంభించి, నేడు దేశ వ్యాప్తంగా నడుస్తోంది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎక్బాల్‌ మినార్‌ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి చదార్‌ సమర్పించారు. అనంతరం మైదానంలో తన ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా కేసీఆర్‌ పాలన సాగిందన్నారు. రంజాన్‌ పండుగకు అధికార గుర్తింపు ఇచ్చి తోపాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ముస్లిం దోస్త్‌ బీఆర్‌ఎస్‌..

అంతకుముందు మాజీ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ ముస్లిం దోస్త్‌ బీఆర్‌ఎస్‌ అని, కేసీఆర్‌, హరీశ్‌రావులు ముస్లిం సంక్షేమం కోసం పాటుపడినట్లు తెలిపారు. పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌, మైనార్టీ నాయకులు మోహిజ్‌, నయ్యర్‌, హమీద్‌, వజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement