వర్గల్(గజ్వేల్): ధ్వజారోహణ మహోత్సవంతో నాచగిరి పరవశించింది. నాచగిరీశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం గరుడ ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి సన్నాహ సూచికగా సాయంత్రం సకల దేవతాహ్వానం పలుకుతూ భేరీపూజ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 10 గంటలకు శ్రీవారి తిరుకల్యాణోత్సవం జరుగుతుంది.
వైభవంగా నాచగిరీశుని బ్రహ్మోత్సవాలు


