● కరెంట్ కోతలను సహించం ● ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ● గజ్వేల్ సబ్‌స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ నిరసన
గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారకపోతే సహించేదీలేదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లోని సబ్‌స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌శాఖ డీఈ భానుప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకుమించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


