ఉద్యోగ భద్రత కల్పించాలి
సిద్దిపేటజోన్: రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కోసం పనిచేస్తున్న 6500 మంది లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లైసెన్స్ సర్వేయర్ల ప్రతినిధులు ఆయనను కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్లను సాధించడానికి వారికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. వారి పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వం మీద నమ్మకంతో చేరిన లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి పది రూపాయల కమీషన్ ఇస్తామని ప్రభుత్వం పేర్కొందని విమర్శించారు. కమీషన్ పేరిట వారి జీవితాలతో ఆడుకోవద్దని, గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.


