ప్రజా సేవ చేసేందుకే..
సంగారెడ్డి: ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి మా నాన్న గడ్డం వెంకటరాజు సహకారంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాను. ప్రజలు నాపై నమ్మకం ఉంచి వార్డు సభ్యురాలుగా గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. మొత్తం సంగారెడ్డిలో 38 వార్డులకు గాను 8 మంది 35 సంవత్సరాల లోపు కౌన్సిలర్లు గెలిచారు. ఇందులో మనీషా 24 ఏళ్లకే కౌన్సిలర్ కావడం విశేషం.
– గడ్డం మనీషా, 30వ వార్డు కౌన్సిలర్,
సంగారెడ్డి మున్సిపాలిటీ.


