యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివినా ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్లుగా గెలిచి పట్టణాలను ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అత్యధికులు 35 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. ‘పురం’లో తమ మ | - | Sakshi
Sakshi News home page

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివినా ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్లుగా గెలిచి పట్టణాలను ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అత్యధికులు 35 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. ‘పురం’లో తమ మ

Mar 1 2026 8:38 AM | Updated on Mar 1 2026 8:38 AM

యువత

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 ● డివిజన్లు ఏర్పాటైనా భర్తీ కానీ పోస్టులు ● రోడ్లు, భవన నిర్మాణాల పర్యవేక్షణ కరువు ● పలు రోడ్లు గుంతల మయం, పనులు నత్తనడక

8లో

న్యూస్‌రీల్‌

చేర్యాల నుంచి నంగునూరుకు వెళ్లే ఈ దారి దాదాపు 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు రెండు నియోజకవర్గాలను, అలాగే రెండు జాతీయ రహదారులను కలపనుంది. దీంతో చాలా వాహనాలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డును సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు.

మెదక్‌–సిద్దిపేట– ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ)పై బ్రిడ్జి నిర్మాణం కోసం 2023లో శంకుస్థాపన చేశారు. పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో రెండున్నరేళ్లుగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో రైల్వే గేట్‌ పడితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇఫ్తార్‌ ఆదివారం: 6.28

సహర్‌ సోమవారం: 5.11

ఇంజనీర్లు కావలెను

నాచగిరి ఉత్సవాలకు రండి

వర్గల్‌(గజ్వేల్‌): నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో మార్చి 8 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఈమేరకు శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి ఆలయ చైర్మన్‌ పల్లె రవీందర్‌గుప్త, ఈఓ రంగాచారి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం అర్చకుల మహదాశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేసినట్లు ఈఓ తెలిపారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆవిష్కరించారు. ఉత్సవాలకు సంబంధించి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీ చైర్మన్‌ గోపాల్‌రెడ్డిలకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు ఈఓ తెలిపారు.

నేడు మల్లన్న ఏడోవారం

భారీగా తరలిరానున్న భక్తులు

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో భాగంగా ఏడో ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. శనివారం సాయంత్రానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. వేకువ జామున పుష్కరిణిలో స్నానమాచరించి మల్లన్నకు పట్నం వేసి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకోనున్నారు.

మల్లన్న ఆలయ ఈఓగా కృష్ణప్రసాద్‌

మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈఓగా డి.కృష్ణప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈఓగా పనిచేస్తున్న టంకసాల వెంకటేశ్‌ శనివారం పదవీ విరమణ పొందడంతో అతని స్థానంలో దేవాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రసాద్‌ ఈఓగా నియమించారు.

దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణకు గాను అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యూటీ అండ్‌ వెల్నెస్‌, మెహిందీ ఆర్ట్‌, ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పది, ఇంటర్‌ చదివిన అభ్యర్థులు ఈ నెల 7న లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9866123213లో సంప్రదించాలన్నారు.

ఎఫ్‌పీఓకు ఎక్సలెన్స్‌ అవార్డు

చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం(ఎఫ్‌పీఓ)కు ఎన్‌సీడీసీ ప్రాంతీయ కో ఆపరేటివ్‌ ఎక్సలెన్స్‌తో పాటు మెరిట్‌ అవార్డును హైదరాబాద్‌లో సంఘం చైర్మన్‌ వెంకట్‌రెడ్డికి అందజేశారు. వివిధ రంగాలలో సంఘం సాధించిన ఘనత ఆధారంగా ఈ అవార్డులను ప్రదానం చేసినట్లు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు జీడీ సతీష్‌ కుమార్‌, దినేష్‌ కుమార్‌లు తెలిపారు. సంఘం చైర్మన్‌ ఏలేటి వెంకట్‌ రెడ్డి, డైరెక్టర్‌లను పలువురు అభినందించారు.

జిల్లాలో సగానికిపైగా ఖాళీలు

సాక్షి, సిద్దిపేట

జిల్లాలో రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖలో ఇంజనీర్ల పోస్టులు భర్తీ కాకపోవడం పర్యవేక్షణకు అవరోధంగా మారుతోంది. జిల్లా కేంద్రంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) సర్కిల్‌ కార్యాలయం పరిపాలన సౌలభ్యం కోసం సిద్దిపేట, గజ్వేల్‌ రెండు డివిజన్‌ కార్యాలయాలుగా మార్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంజనీర్లను భర్తీ కాకపోవడంతో రోడ్ల దుస్థితిపై సరైన పర్యవేక్షణ కొరవడుతోంది. పనులు చేసే చోట్ల నాణ్యతా ప్రమాణాలపై ప్రభావం పడుతోంది. రెండు డివిజన్ల పరిధిలో 57 మంది వివిధ హోదాల్లో అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉన్నవారు డిప్యుటేషన్లపై..

జిల్లాలో రెండు డివిజన్లు, ఆరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 29 మంది వివిధ హోదాల్లో ఇంజనీర్లు ఉండాలి. అందులో 14 మంది మాత్రమే ఉండగా మిగతా 15 ఖాళీలే ఉన్నాయి. ఈ 14 మందిలో సైతం సిద్దిపేట డిప్యూటీఈఈ పని చేస్తున్న వెంకటేశం ఆరు నెలల క్రితం విద్యాశాఖకు డిప్యూటేషన్‌ పై వెళ్లారు. సిద్దిపేట డివిజన్‌ ఈఈ పోస్టు ఖాళీగా ఉండటంతో గజ్వేల్‌ ఈఈకి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. సిద్దిపేట సబ్‌ డివిజన్‌లో డిప్యూటీ ఈఈ లేకపోవడంతో హుస్నాబాద్‌ డిప్యూటీఈఈకి ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు. జగదేవ్‌పూర్‌ సబ డివిజన్‌ పరిధిలో ఒక్క డిప్యూటీఈఈ మాత్రమే ఉండగా ఏఈఈలు లేకపోవడంతో పర్యవేక్షణ కరువుతోంది.

అటకెక్కిన నాణ్యత ప్రమాణాలు

ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టులన్నీ వివిధ ప్రాంతాల్లోని రోడ్లను పర్యవేక్షణ చేయాల్సినవే. ఆర్‌అండ్‌బీ ప్రాథమిక నిబంధన ప్రకారం రోడ్లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. గుంతలమయంగా మారితే బాగుచేయించి రాకపోకలకు అవరోధం లేకుండా చూసే కీలక బాధ్యత ఏఈఈలదే. ఖాళీల కారణంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలన అటకెక్కింది. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇది గుత్తేదారులకు అన్ని విధాలుగా కలిసివస్తోంది.

పై చిత్రంలోని కార్యాలయం రెండు జిల్లాలకు చెందిన రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖకు చెందినది. శనివారం ఉదయం 10:50గంటలకు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయాన్ని ‘సాక్షి’ ప్రతినిధులు వెళ్లగా ఖాళీ కుర్చీలే దర్శన మిచ్చాయి. ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ సారంగపాణి, డిప్యూటీ ఎస్‌ఈ ఆర్కిపస్‌లు, ఏఈఈ, ఏఈలతో పాటు ఇతర సిబ్బంది రాలేదు. కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే వచ్చారు. దీంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఒక్కొక్కరు 11:20గంటల నుంచి కార్యాలయంకు రావడం ప్రారంభించారు. ఎప్పుడూ సమయ పాలన పాటించరని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్‌ఈ సారంగపాణిని ఫోన్‌లో సంప్రదించగా ఈఎన్‌సీ కార్యాలయంలో తాను, డిప్యూటీ ఎస్‌ఈ ఇద్దరం సమావేశానికి వెళ్లామని, మిగతా వారు వస్తారని దాటవేశారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు, కలెక్టర్‌ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

త్వరలో పదోన్నతులు

శాఖలో త్వరలో పదోన్నతులు ఇవ్వనున్నారు. అప్పుడు కొంత మంది ఇంజనీర్లు రానున్నారు. సర్కిల్‌ పరిధిలో ఖాళీల వివరాలను ఇప్పటికే ఉన్నత అధికారులకు తెలియజేశాం. ఆ పోస్టులు సైతం త్వరలో భర్తీ అయ్యే అవకాశం ఉంది.

– సారంగపాణి, ఎస్‌ఈ, ఆర్‌ అండ్‌ బీ

హోదా మంజూరు సంఖ్య భర్తీ ఖాళీలు

ఈఈ 2 01 01

డిప్యూటీఈఈ 7 05 02

ఏఈఈ 14 07 07

ఏఈ 06 01 05

కేసులు ఎత్తివేయాలి

వర్గల్‌(గజ్వేల్‌): అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం గద్దెను నిర్మిస్తున్న నాయకులపై కేసులు ఎత్తివేయాలని డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఏగొండ స్వామి డిమాండ్‌ చేశారు. శనివారం వర్గల్‌ మండలం నాచారంలో నిర్మాణ దశలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటు చేస్తున్న గద్దెకు ఇరువైపులా దాదాపు 26 ఫీట్ల దారి ఉన్నప్పటికీ అనవసరంగా అంబేడ్కర్‌ సంఘ నాయకులను పర్మిషన్ల పేరుతో కేసులు పెట్టారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దళిత బహుజన సంఘాలు సంఘటితంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటేశ్‌, కృష్ణ, ప్రభాకర్‌, నరేష్‌, బాబు, భగత్‌ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులోభాగంగానే అర్హులైన వారికి స్కూటీలను అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ట్రై సైకిల్‌, ల్యాప్‌టాప్‌ తదితర పరికరాలను అందించింది. స్వయం ఉపాధి పొందుతున్న వారితో పాటు ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారికి ప్రాధాన్యం కల్పిస్తోంది.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ

అర్హులైన దివ్యాంగులు వాహనాలు పొందేందుకు ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా ఎక్కువశాతం వైకల్యం కలిగి ఉండి, వాహనం నడపగలిగి, డిగ్రీ, పీజీ చదువుకున్న వారితో పాటు స్వయం ఉపాధిలో రాణిస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేకు 50 మందిని ఎంపిక చేశారు.

సైడ్‌ వీల్స్‌ బిగించి.. త్వరలో పంపిణీ

జిల్లాలో 14 వేలకు పైగా దివ్యాంగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే స్కూటీలు ఇటీవలే కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనాలు నడుపుకునేందుకు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు సైడ్‌ వీల్స్‌ బిగించనున్నారు. త్వరలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయనున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రభుత్వానిదే

ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేయనుంది. సంబంధిత శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి అందించనుంది. ఒక్కో వాహనం రూ.1,10,000 వరకు ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికై న వారికి పూర్తిస్థాయిలో ఉచితంగా పంపిణీ చేస్తారు.

ఖాళీ కుర్చీలే దర్శనం

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన1
1/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన2
2/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన3
3/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన4
4/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన5
5/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన6
6/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన7
7/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన8
8/8

యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement