మాస్‌ కాపీయింగ్‌ జరిగితే వేటే | - | Sakshi
Sakshi News home page

మాస్‌ కాపీయింగ్‌ జరిగితే వేటే

Mar 1 2026 8:38 AM | Updated on Mar 1 2026 8:38 AM

మాస్‌ కాపీయింగ్‌ జరిగితే వేటే

మాస్‌ కాపీయింగ్‌ జరిగితే వేటే

● పకడ్బందీ చర్యలు చేపట్టాలి ● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

● పకడ్బందీ చర్యలు చేపట్టాలి ● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

మిరుదొడ్డి(దుబ్బాక): ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. మిరుదొడ్డి మోడల్‌ స్కూల్‌/కళాశాల కేంద్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియెట్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా విధులు నిర్వహించాలని ఎగ్జామ్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్లు అనుమతి లేదనీ, విద్యార్థులను పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే పరీక్షలకు అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.

వైద్య సిబ్బందిపై ఆగ్రహం

మిరుదొడ్డి పీహెచ్‌సీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం అందుతున్న తీరును ఇటు రోగులను, అటు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్‌ రిజిస్టర్‌ను పరిశీలిస్తూ ఉదయం 10.15 గంటలు దాటినా మెడికల్‌ ఆఫీసర్‌ సమీనా సుల్తానా, ల్యాబ్‌ టెక్నీషియన్లు రవీందర్‌ గైర్హాజ రవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్‌ విజిట్‌ పై వెవెళ్లిన వారు తప్పని సరిగా ఏ గ్రామానికి వెళ్తున్నారో ఆస్పత్రిలో సమాచారం ఇవ్వాలన్నా రు. గైర్హాజరైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఫోన్‌ ద్వారా ఆదేశించారు. విధులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement