పెండింగ్ కేసులు పరిష్కరించండి
హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్
సిద్దిపేటకమాన్: పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి పుల్లా కార్తీక్ అన్నారు. జిల్లా కోర్టును హైకోర్టు న్యాయమూర్తి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, ఇతర న్యాయమూర్తులు స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కోర్టు హాల్‌లో న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయశాఖ పనిచేస్తుందని జిల్లాలో వివిధ కేసుల్లో వచ్చే కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అదేవిధంగా పెండింగ్ కేసులు ఎప్పటికపుడు పరిష్కరిచాలన్నారు. అంతకుముందు హరిత మినర్వా హోటల్‌లో కలెక్టర్ హైమావతి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి సంతోష్‌కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


