ప్రత్యేక కార్యాచరణతో ప్రగతి బాట
చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన గజ్వేల్ మున్సిపల్ తొలి పాలకవర్గ సమావేశం
గజ్వేల్: ప్రజలకు మెరుగైన సేవే లక్ష్యంగా పనిచేస్తామని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన అన్నారు. శనివారం పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి అత్యవసర సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అందరి సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతామన్నారు. ఇందుకోసం వార్డులవారీగా సమస్యలను తెలుసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పది అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యన్‌కర్ పద్మాబాయి, కౌన్సిలర్లు, సెక్షన్ హెడ్‌లు పాల్గొన్నారు.


