ఆరోగ్యంపై డ్రైవర్లు దృష్టిసారించాలి
ఏసీపీ సదానందం
హుస్నాబాద్: డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఏసీపీ సదానందం సూచించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం నిర్వహించిన ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రైవర్లకు నేత్రవైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లారీలు, డీసీఎంలు, ఆటోలు, స్కూల్ బస్సు డ్రైవర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


