వైభవంగా శ్రీవారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి కల్యాణం

Feb 28 2026 8:43 AM | Updated on Feb 28 2026 8:43 AM

వైభవం

వైభవంగా శ్రీవారి కల్యాణం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భూ నీలా సమేత వేంకటేశ్వరస్వామిల కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ఆవరణ గోవింద నామస్మరణతో మార్మోగింది. అంతకు ముందు స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

కాళేశ్వరం తెచ్చిన ఘనత కేసీఆర్‌దే

నంగునూరు(సిద్దిపేట): కరువు ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి సస్యశ్యామంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మైసంపల్లి లోని పెద్దమ్మ దేవాలయం, వెంకటాపూర్‌లో హన్‌మాన్‌ దేవాలయ వార్షికోత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టుకోవడంతో సిద్దిపేట ప్రాంతంలో 80 వేల ఎకరాల్లో సంవత్సరానికి రెండు పంటలు పండుతున్నాయన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్‌ రైతుబంధు డబ్బులు ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి మూడు దఫాలుగా డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సంతోష్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, లింగంగౌడ్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం1
1/1

వైభవంగా శ్రీవారి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement