విధుల్లో నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటరూరల్: ఆయిల్ పామ్ సాగు పనితీరు మందకొడిగా ఉందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లా ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చురుకుగా పనిచేయాలన్నారు. కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేయడానికి రైతులను ప్రోత్సహించాలని, రైతులను గుర్తించగానే డీడీ తీసుకుని వెంటనే చదును చేయించి ఫిట్టింగ్, ప్లాంటింగ్ చేయించాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారీగా సమీక్ష జరిపి ఫార్మసీ రిజిస్ట్రీ నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఫార్మసీ రిజిస్ట్రీ వంద శాతం పూర్తి చేయాలని, డివిజన్ వారీగా ఏడిఏ లు క్లస్టర్ వారీగా ఏఓ, ఏఈఓ లను తరచూ ప్రణాళిక ప్రకారం పర్యవేక్షణ చేస్తూ పూర్తి చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం చేరాల్సిందే
కలెక్టర్ హైమావతి
అధికారులతో సమావేశం


