నేడు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని స్థానిక విపంచి కళానిలయంలో శనివారం నిర్వహించనున్నట్లు కార్యక్రమ జిల్లా చైర్‌పర్సన్ డాక్టర్ సునీత చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం స్థానిక ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 50 సంవత్సరాల ఎమెర్జెన్సీ కాలము భారత ప్రజాస్వామ్య పాఠాలు అనే అంశంపై విద్యార్థులు మాట్లాడాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమంగా మాట్లాడిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. వారు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడాలని అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో మాట్లాడేందుకు ఇప్పటివరకు 200 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 9704425028 నంబర్‌లో సంప్రదించాలని కార్యక్రమ జిల్లా సమన్వయకర్త డాక్టర్ శ్రద్ధానందం సూచించారు.


