నాణ్యమైన వైద్యం అందించాలి
ములుగు(గజ్వేల్): ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ సూచించారు. శుక్రవారం ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలనను పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు వంద శాతం టీకాలు అందించాలన్నారు. రానున్న ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి ధనరాజ్
ములుగు పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ


