రెండో రోజూ పరీక్షలు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ పరీక్షలు ప్రశాంతం

Feb 27 2026 10:51 AM | Updated on Feb 27 2026 10:51 AM

రెండో రోజూ పరీక్షలు ప్రశాంతం

రెండో రోజూ పరీక్షలు ప్రశాంతం

సిద్దిపేటఎడ్యుకేషన్‌: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్ష లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజై న గురువారం సెకండియర్‌ విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్‌ తదితర సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష జరిగింది. జనరల్‌ విభాగంలో 6,870 మందికి 6,760 మంది విద్యార్థులు హాజరుకాగా 110 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 2,209 మందికి 2,139 మంది హాజరుకాగా 70 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌లో 98 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్‌ బోర్డు అధికారులు జగదేవ్‌పూర్‌ పరీక్షా కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేయగా, జిల్లా ఇంటర్‌ విద్యాధి కారి రవీందర్‌రెడ్డి, డీఈసీ సభ్యులు గంగాధర్‌, ఫ్లై యింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు శ్రీనివాస్‌లు ఉదయం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పరీక్షా పత్రాల పంపిణీ పర్యవేక్షించారు. అనంతరం చిన్నకోడూరు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సీఎస్‌, డీఓలకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఇక హైపవర్‌ కమిటీ సభ్యురాలు హిమబిందు హుస్నాబాద్‌ లోని పరీక్షా కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేశారు.

మూల్యాంకన కేంద్రం ప్రారంభం

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (కోఎడ్యుకేషన్‌)లో ఏర్పాటు చేసిన ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని గురువారం జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. క్యాంపు ఏసీఓ జనరల్‌–1 సత్యనారాయణరెడ్డి, చీఫ్‌ కోడింగ్‌ అధికారి శ్రీనివాస్‌ స్ట్రాంగ్‌ రూం ఏసీఓలు అమరేందర్‌రెడ్డి, నర్సిహాచారి పార్శిల్‌ విభాగం ఏసీలుగా స్వర్ణకుమారి, సదానందం నియామకమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement