దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి
మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్‌లో పెట్టొద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం సాయంత్రం సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌తో పాటు అన్ని దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ స్వామి, సూడా, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు
రూపురేఖలు మారిన ఎన్సాన్‌పల్లి
సిద్దిపేటఅర్బన్: ఎన్సాన్‌పల్లి పూర్తిగా రూపురేఖలు మార్చుకొని పట్టణ వాతావరణం సంతరించుకుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎన్సాన్‌పల్లిలో ముత్యాల పోచమ్మ దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ చెరువు ఎండాకాలంలో మత్తడి దూకుతుందని, కాళేశ్వరం నీళ్లతోనే రెండు పంటలు పండుతున్నాయని అన్నారు. అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా చేసుకున్నామని అన్నారు.


