వేములవాడ, చేగుంటకు కొత్తగా బస్సులు
● నేడు దుబ్బాకలో ప్రారంభం ● పలు గ్రామాలకు రవాణా సౌకర్యం
దుబ్బాక: స్థానిక డిపో నుంచి వేములవాడ, చేగుంట రూట్లలో నూతనంగా కొత్త బస్సులు ప్రారంభం కానున్నాయి. ఎన్నో రోజులుగా ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు, చేగుంట రూట్లలో బస్సుల కోసం ఎదురుచూస్తున్న పలు గ్రామాల ప్రజల కల నెరవేరబోతోంది. శుక్రవారం దుబ్బాకలో బస్సులు ప్రారంభించనున్నారు. వేములవాడకు దుబ్బాక నుంచి ఉదయం 5.30కు ప్రారంభమై రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకుంటుంది. ప్రతిరోజు ఈ బస్సును మూడు ట్రిప్పులు నడపనున్నారు. దీంతో 15 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కలగడంతో పాటుగా పుణ్యక్షేత్రం వేములవాడకు వెళ్లేందుకు భక్తులకు సౌకర్యం కలగనుంది. అలాగే దుబ్బాక నుంచి అక్భర్‌పేట–భూంపల్లి మీదుగా చేగుంట రూట్‌లో బస్సు వేయడం వల్ల సుమారుగా 12 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పడనుంది.


