దెబ్బతిన్న పంటలకు పరిహారం అందజేత | - | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పంటలకు పరిహారం అందజేత

Feb 27 2026 10:47 AM | Updated on Feb 27 2026 10:47 AM

దెబ్బతిన్న పంటలకు పరిహారం అందజేత

దెబ్బతిన్న పంటలకు పరిహారం అందజేత

సెప్టెంబరు 8న క్లోరినేషన్‌ గ్యాస్‌ లీకేజీ

15 మందికి రూ.7.10 లక్షలు అందజేత

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లి మండల పరిధిలోని మంగోల్‌ శివారు లోని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ క్లోరినేషన్‌ విభాగం నుంచి గ్యాస్‌ లీకేజీతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. 15 మంది రైతులకు రూ.7.10 లక్షల చెక్కులను గురువారం తహసీల్దార్‌ సుజాత బాధితులకు అందజేశారు. సెప్టెంబరు 8న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘పరిహారం పొందేదెప్పుడు?’ అనే కథనానికి ప్రభుత్వం స్పందించింది. మంగోల్‌ శివారులోని 540 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ నుంచి ప్రతీరోజు సిద్దిపేట, గజ్వేల్‌, జన గామ, ఆలేరు, బోనగిరి, మేడ్చెల్‌ పట్టణాలకు మిషన్‌ భగీరథ పథకంలో తాగునీరు సరఫరా జరు గుతుంది. ఈ క్రమంలో నీటిని శుద్ధి చేయడానికి ఉప యోగించే క్లోరినేషన్‌ గ్యాస్‌ సిలిండర్లను నిర్లక్ష్యంగా ఆరుబయట ఉంచారు. ప్రమాదవశాత్తు వాటి నుంచి క్లోరిన్‌ లీకయింది. దీంతో ప్లాంట్‌ పరిసర మంగోల్‌, మేదినీపూర్‌ గ్రామ శివారుల్లోని సుమారు 40 ఎకరాల వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ హైమావతి పరిశీలించి నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు భరోసానిచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహారాన్ని తహసీల్దార్‌ బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కరుణాకర్‌, నాయకులు విరుపాక రమేశ్‌రెడ్డి, రవీందర్‌, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎఫెక్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement