గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తాం
సిద్దిపేటఅర్బన్: మిట్టపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, అందుకు తన సహాయ సహకారాలు అందజేస్తానని టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్ చింతల శ్రీనివాస్ యాదవ్‌తో పాటు వార్డు మెంబర్లను, పంచాయతీ కార్యదర్శి విజయ్, గ్రామ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. గతంలో మిట్టపల్లి గ్రామ సర్పంచ్‌గా, పీఎసీఎస్ చైర్మన్‌గా పనిచేశానని అప్పుడు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపామన్నారు. ప్రస్తుతం ఎన్నికై న పాలకవర్గం అంతా యువత.. గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పయ్యావుల రాములు, నాయకులు కిషన్, జేపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీఎఫ్‌సీసీ చైర్మన్ రామకృష్ణగౌడ్


