విశ్వతేజకు బాలరత్న
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నవయస్సులోనే అద్భుత కథలు రాసిన అనంతసాగర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి విశ్వతేజకు బాలరత్న అవార్డు వరించింది. ఇటీవల కెనడా దేశం ఆధ్వర్యంలో జరిగిన కథల పోటీల్లో విశ్వతేజ మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్‌కు చెందిన కమలాకర ట్రస్టు వారు శుక్రవారం ఈ అవార్డును బహూకరించారు. అవార్డు పొందిన విశ్వతేజను కలెక్టర్ హైమావతి అభినందించి సన్మానించారు. పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి ఆంగ్లభాష ప్రతిభా పోటీలను ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో భాగంగా టెడ్, ఎడ్, స్టూడెంట్ టాక్ పోటీలు చేపట్టారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒలింపియాడ్ ప్రశ్నపత్రాన్ని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి ముండ్రాతి రమేశ్, సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎల్‌పీఓ చందన
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తేనే వ్యాధులు దరి చేరవని డీఎల్‌పీఓ చందన అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామునిపట్లను సందర్శించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిశీలించారు. మురికి కాలువల్లో చెత్తవేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైనేజీ సమస్యను త్వరలోనే అందరి సహకారంతో పరిష్కరిస్తామన్నారు.
వర్గల్(గజ్వేల్): శ్రవణానందానికే పరిమితం కాకుండా ఏకీకృతమయ విధానంలో మన శాస్త్ర ధర్మాలు, ప్రాంతీయ ఆచారాలను సంరక్షించుకోవాలని గురుమదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. శుక్రవారం నాచగిరి టీటీడీ కల్యాణ మండపం వేదికగా లక్ష్మీ గణపతి బ్రాహ్మణ సేవా సమితి, ఆలయ అర్చక, పురోహిత వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ వైతాళికులు శాస్త్రుల విశ్వనాథశాస్త్రి శతజయంతి సభకు హాజరయ్యారు. ప్రముఖ పండితులు యాయవరం రామశర్మ, డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మలను ఘనంగా సత్కరించారు. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ మన ప్రాంతంలో సంస్కృతం, శాస్త్రం, వేదం పరిఢవిల్లాలన్నారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2012 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులను నుంచి మినహాయించేందుకు ప్రత్యేక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
విశ్వతేజకు బాలరత్న
విశ్వతేజకు బాలరత్న
విశ్వతేజకు బాలరత్న


