డైట్ మెనూ పాటించాల్సిందే
చిన్నకోడూరు(సిద్దిపేట): కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. నాణ్యమైన ఆహారపదార్థాలను వాడుతూ రుచికరంగా వండాలని సూచించారు. విద్యార్థులు కడుపునిండా లినాలని, అప్పుడే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ఆమె వెంట హెచ్‌ఎం జ్యోతి, టీచర్‌లు ఉన్నారు.


