జీరామ్‌జీతో 120 పనిదినాలు
హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ
సిద్దిపేటకమాన్: గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు వంద రోజుల పని మాత్రమే కల్పించేవారని, జీరామ్‌జీ చట్టం ద్వారా 120 పని దినాలు కల్పించినట్లైందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో శనివారం నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి న జీరామ్‌జీ చట్టం గ్రామీణ కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కూ లీల వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖా తాల్లోనే జమ చేసే విధంగా చట్టం రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, రాంచంద్రారెడ్డి, జనార్థన్, చందు తదితరులు పాల్గొన్నారు.


