గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కోహెడరూరల్(హుస్నాబాద్): కోహెడ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీసీఈటీ–2026) నోటిఫికేషన్ వెలువడింది.4వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, ఆర్థికంగా వెనుబడిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి అడ్మిషన్‌లతో పాటు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సైనిక్ స్కూల్, ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లలో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయన్నుట్లు ప్రిన్సిపల్ తెలిపారు. జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉందన్నారు.
గ్రామీణ క్రీడాకారులు ఎదగాలి
చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
తొగుట(దుబ్బాక): క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని లింగాపూర్‌లో ఆత్మ కమిటీ చైర్మన్ గాందారి నరేందర్‌రెడ్డి నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో యువత క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. ఈ పోటీల్లో 50 జట్లు పాల్గొంటున్నా యని నిర్వాహకులు తెలిపారు. మొదటి బహు మతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు నగదు అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గౌసొద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి, నాయకులు భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రాములు, కిష్టాగౌడ్ పాల్గొన్నారు.
ఇన్ సర్వీస్ టీచర్లకు
టెట్ మినహాయింపు ఇవ్వాలి
టీఎస్‌యూటీఎఫ్
ప్రధాన కార్యదర్శి యాదగిరి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంబద్ధమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్‌న్‌ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు కొడిపల్లి ప్రశాంత్ కుమార్, శివలింగం, జిల్లా కమిటీ సభ్యులు జక్కుల నరసింహులు, శ్రీకాంత్, పరశురాములు, త్రినాస్, తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర విధా నాలపై ఈనెల 8 నుంచి 11 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుయాత్ర శనివారం శివ్వంపేటకు చేరుకుంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీబీ జీరామ్‌జీ, జాతీయ విత్తన సవరణ, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 19న జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నర్సయ్య, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


