గాంధీ పేరును రూపుమాపే కుట్ర
హుస్నాబాద్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును రూపుమాపేందుకు కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును మార్చిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం పట్టణంలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ గ్రామీణ రైతు, కూలీలకు వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఉపాధి పథకం తెచ్చారన్నారు. ఉపాధిహామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో కూలీలకు పని దొరకడంతో పాటు కూలీ రేట్లు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలు తెస్తే స్వాగతిస్తామని, కానీ పథకాలకు పేర్లు మార్చడం సరికాదన్నారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బంక చందు, చిత్తారి రవీందర్, పద్మ, హసన్, రజిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన


