గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
● కలెక్టర్ హైమావతి
● ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల పరీక్షకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రవేశపరీక్షకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6నుంచి 9వ తరగతుల ఖాళీలకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు.http://tgcet.cgg.gov.in ద్వారా వచ్చే నెల జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫొటోలు అవసరమని తెలిపారు. సర్టిఫికెట్ల సత్వర జారీకి కలెక్టరేట్‌లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


