రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి
చేర్యాల(సిద్దిపేట): సుమారు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా జీరో అవర్‌లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరేరాల ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజాభీష్టం నెరవేర్చాలన్నారు. ఈ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.
అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


