నాచగిరి క్షేత్రంలో సర్వం సిద్ధం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం, వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలోని వేంకటేశ్వరాలయాలు ‘ముక్కోటి’ ఏకాదశి పర్వదిన వేడుకలకు ముస్తాబయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని నాచగిరి చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ విజయరామారావు పేర్కొన్నారు.
వర్గల్ కోవెలలో..
వర్గల్ వేంకటేశ్వరాలయంలో తెల్లవారుజాము 3.00 గంటలకు అభిషేకం, 5.30 గంటల వరకు అలంకార సేవ, 5.45 గంటల వరకు ఉత్తర ద్వార పూజ, 6.00 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి తులసి అర్చన, పంచసూక్త పారాయణాలు జరుగుతాయని ఆలయ మేనేజర్ రఘుపవన్‌రావు తెలిపారు.
ఆలయంలో కొలువైన శ్రీవారు
వర్గల్‌లోని వేంకటేశ్వరాలయం


