రైతుల గోస పట్టని సర్కార్
దుబ్బాక: రైతుల కష్టాలు పట్టడంలేదని, కనీసం యూరియా కూడా అందించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రఘోత్తంపల్లి శివారులో వరినాట్లు వేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా యూరియా దొరకడం లేదని, సాగు చేయాలంటే ఇబ్బందులు తప్పడంలేదని రైతులు ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే రైతులు ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని రైతులకు అప్పుడే మంచిరోజులు వస్తాయన్నారు. రైతులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. అధైర్యపడొద్దని తప్పకుండా మంచి రోజులు వస్తాయన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
నాట్లేస్తున్న రైతులతో మాటామంతి


