త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చాం క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ దౌల్తాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు
దుబ్బాక: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రీస్మస్ సంబరాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.27 వేల కోట్లు అందించామన్నారు. పేదలకు అండగా నిలవాలన్న సంకల్పంతోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీస్మస్ పండగను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు.


