విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● ప్రజ్ఞాపూర్‌లో గురుకుల పాఠశాల తనిఖీ
గజ్వేల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదీలేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. బుధవారం ప్రజ్ఞాపూర్‌లోని సాంఘిక గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటల తీరు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి కామన్ డైట్‌ను ఎందుకు పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో, వరండాలో విద్యార్థుల సామగ్రి, ఎక్కడపడితే అక్కడే చెత్త ఉండటం చూసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి కారకులైన ప్రిన్సిపాల్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులకు అక్కడి నుంచే ఫోన్‌లో ఆదేశించా రు. అనంతరం మైనార్టీ బాలికల గురుకులం, జూనియర్ కళాశాలను సైతం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు.
తీగుల్ పీహెచ్‌సీ సందర్శన..
జగదేవ్‌పూర్ మండలం తీగుల్ పీహెచ్‌సీని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పీహెచ్‌సీ పరిసరాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.


