విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
జూనియర్ కళాశాలలో వీర్‌బాల దివస్
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో–ఎడ్)లో బుధవారం వీర్‌బాలదివస్‌ను పురస్కరించుకుని కేంద్ర సీ్త్ర శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, పీఎఫ్ కార్యాలయ అధికారి వేణుగోపాల్‌లు మాట్లాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ వీర్ బాలదివస్‌ను 2022లో ప్రారంభించారన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. గురుగోవింద్ సింగ్ కుమారులు బాబాజోరావర్ సింగ్, ఫతే సింగ్‌ల ధైర్యం, త్యాగాలకు గుర్తుగా జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు అర్షియా తబుస్సుమ్, జ్యోతి, అభిలాష్‌రెడ్డిలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్, స్టూడెంట్ కౌన్సిలర్ తహసీన్‌ఫాతిమా, పీఎఫ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ లక్కిరెడ్డి సునీల్‌రెడ్డితో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.


