
రవిరాజ్ బోధనకు ప్రపంచస్థాయి ప్రశంసలు
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ వినూత్న రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యాబోధన చేస్తూ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. నర్సాపూర్ మండలం అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ బోధనలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. 2008 డీఎస్సీలో ఉపాధ్యాయునిగా ఎంపికై ఉమ్మడి మెదక్ జిల్లా కంగిటి మండలం చౌకన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో బాధ్యతలు చేపట్టారు. 43 మంది విద్యార్థులతో కొనసాగుతున్న పాఠశాలలో 104 మంది విద్యార్థుల సంఖ్యను పెంచి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందారు. 2004లో అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 53 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 70కి పైగా విద్యార్థుల సంఖ్యను పెంచి తన ప్రత్యేకతను చాటారు. నెల రోజుల క్రితం సొంతంగా లక్ష రూపాయలతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై బెల్టులు, ఆట వస్తువులు డీఈఓ రాధాకిషన్ చేతుల మీదుగా అందజేశారు.