
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
చిన్న బ్రమ్మయ్య
రామకృష్ణ
బద్దిపడగ రమేశ్
నంగునూరు(సిద్దిపేట)/వర్గల్/మర్కూక్(గజ్వేల్): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ముగ్గురు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్న రామకృష్ణ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది. అలాగే మర్కూక్ మండలం దామరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. బోధనలో నిబద్దత, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిస్తుండటంతో ఈ ఆవార్డు లభించింది. వర్గల్ మండలం మజీద్‌పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దిపడగ రమేశ్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ‘ఇళ్లు.. గుడి.. బడి ప్రపంచం’ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ విద్యారంగ కార్యక్రమాలకు ఇతోధిక ప్రచారం కల్పించారు.
జిల్లా స్థాయిలో 55 మంది
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్‌లో ప్రశంస పత్రాలతో పాటు సన్మానించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..