
సార్ సేవలకు ఇరవై ఏళ్లు
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
పిల్లల మధ్యే విశ్రాంత జీవితం
జగదేవ్‌పూర్(గజ్వేల్): పదవీ విరమణ పొందిన చాలా మంది శేష జీవితం పొందుతారు. కానీ రిటైర్డు ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డి మాత్రం పిల్లల మధ్యే జీవితం సాగిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన తొందూరు బాల్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా 34 ఏళ్లు పనిచేశారు. 2004లో రిటైర్డు అయ్యారు. అయినా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఏడేళ్ల పాటు ప్రయివేట్ పాఠశాలలో పనిచేశారు. అనంతరం గజ్వేల్ మండలం దాచారం ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో మూడేళ్లు, క్యాసారం పాఠశాలలో రెండేళ్లు, ప్రజ్ఞాపూర్ పాఠశాలలో ఏడాది, తిగుల్ ప్రాఽథమిక పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. తెలుగు, గణితం పిల్లలకు బోధిస్తున్నారు. బాల్‌రెడ్డి సేవలకు జిల్లా విద్యాశాఖ అధికారులు, మాజీ మంత్రి హరీశ్‌రావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులు పిల్లలకు పాఠాలు చెబుతానని తెలిపారు.

సార్ సేవలకు ఇరవై ఏళ్లు