
మల్లన్న హుండీ ఆదాయం రూ.45.79లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ. 45,79,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు భక్తుల కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 46 రోజులలో రూ.45,79,870 నగదుతోపాటు విదేశి కరెన్సీ నోట్లు 83, మిశ్రమ బంగారం 44 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 300 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు జయప్రకాశ్‌రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, కాయిత మోహన్‌రెడ్డి, వల్లాద్రి అంజిరెడ్డి, ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు, శివరామ కృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
న్యాయవాదుల
రక్షణకు చట్టం తేవాలి
హుస్నాబాద్: న్యాయవాదులకు రక్షణ కరువైందని, ప్రత్యేక చట్టాన్ని తేవాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాది శ్రీకాంత్‌పై జరిగిన దాడి ని నిరసిస్తూ మంగళవారం కోర్టు ఆవరణలో విధులు బహిష్కరించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. శ్రీకాంత్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సాయిని మల్లేశం, కన్నోజు రామకృష్ణ, మురళీమోహన్, ప్రవీణ్, కిరణ్, సంపత్ తదితరులు ఉన్నారు.
ముగిసినపదోన్నతుల ప్రక్రియ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 154మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లుగా (ఎస్‌ఏ) పదోన్నతులు పొందారన్నారు. అదేవిధంగా 40 మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందినట్లు తెలిపారు.
మహిళలకు
రూ. 40 కోట్ల రుణాలు
వర్గల్(గజ్వేల్): రాబోయే ఏడాదిలో మహిళా సంఘాలకు రూ.40 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెర్ప్ ఏపీఎం కిరణ్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక సెర్ప్ కార్యాలయంలో తాళ్ల రేణుక అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య వార్షిక మహాసభ జరిగింది. రాబోయే సంవత్సరంలో 420 మందిని మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, బ్యాంకు లింకేజీ ద్వారా 669 సంఘాలకు రూ. 40 కోట్ల రుణాలు అందించాలని తీర్మానించారు. అలాగే మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు మహిళాలోకం బాసటగా నిలవాలని పిలుపునిస్తూ కిరణ్‌కుమార్ అందరికీ మట్టివినాయక ప్రతిమలు పంపిణీ చేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం
సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యయాదవ్
గజ్వేల్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ అన్నారు. మంగళవారం రిమ్మనగూడలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.

మల్లన్న హుండీ ఆదాయం రూ.45.79లక్షలు

మల్లన్న హుండీ ఆదాయం రూ.45.79లక్షలు