
దశలవారీగా డబ్బులు జమ
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలని జెడ్పీ సీఈఓ రమేశ్ సూచించారు. మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాలు చేపట్టిన దశలవారీగా డబ్బులు జమవుతున్నాయన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మరళీధర్‌శర్మ, పంచాయతీ కార్యదర్శి గౌస్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ రమేశ్