
పల్లెల్లో స్థానిక జోరు
● ఓటరు తుది జాబితాకుషెడ్యూల్ విడుదల ● రేపు 508 జీపీలు, 4,508వార్డుల వారీగా జాబితా ప్రదర్శన
సాక్షి, సిద్దిపేట: పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి జోరందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను విడుదల చేసి ఫైనల్ పబ్లికేషన్ చేసేందుకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులుండగా 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు.
హైకోర్టు తీర్పుతో..
పల్లెలో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30లోగా గ్రామ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే నెలలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది.
పంచాయతీలకు పంపిస్తున్నాం
వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేసి పంచాయతీలకు పంపిస్తున్నాం. ఈ నెల 28న ఉదయం ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 2న ఫైనల్ జాబితాను విడుదల చేస్తాం.
– దేవకీదేవి, డీపీఓ
ఈనెల 28న పంచాయతీ, వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు.
ఈనెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరగనున్నాయి.
ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.

పల్లెల్లో స్థానిక జోరు