మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం కుటుంబ సమేతగా స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎంపీకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు అందిస్తున్న ప్రసాదం పథకంలో కొమురవెల్లి ఆలయాన్ని చేర్చాలని ఈఓ అన్నపూర్ణ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రసాదం పథకంలో మల్లన్న ఆలయాన్ని చేర్చి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని త్వరలోనే ప్రారంభించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఎంపీ నిధుల నుంచి ఆలయ ఆవరణలో అతిథి గృహం నిర్మించడానికి ప్రణాళిక, ప్రతిపాదనలు తయారు చేయించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జనగామ, సిద్దిపేట బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
గజ్వేల్‌రూరల్: మట్టితో తయారు చేసిన గణపయ్యలను ప్రతిష్ఠించి పూజించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. బీజేపీ నాయకులు, టెలికం బోర్డు సభ్యుడు కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట మట్టి గణపయ్యల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి గణపయ్యల విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు కలుషితమై అందులోని జలచరాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎల్లు రాంరెడ్డి, పట్టణశాఖ అధ్య క్షుడు మనోహర్‌యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివకుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పేర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్
అదనపు డీసీపీగా కుశల్కర్
సిద్దిపేటకమాన్: నూతన అదనపు డీసీపీ (అడ్మిన్) గా సీహెచ్ కుశల్కర్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఏసీపీ నరసింహులు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మట్టి గణపయ్యనే ప్రతిష్ఠిద్దాం
● పర్యావరణాన్ని కాపాడుదాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్
స్కాలర్‌షిప్‌లు
విడుదల చేయండి
దుబ్బాక: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ దుబ్బాక నగర కార్యదర్శి జశ్వంత్ డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. లక్షలాది పేద విద్యార్థులు పైచదువులకు పోకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అఖిల్, శేషాంక్, రాజు, దిలీప్, రాకేశ్ ఉన్నారు.
1/2
మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి
2/2
మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి