ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చాలి | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చాలి

Aug 25 2025 9:13 AM | Updated on Aug 25 2025 9:13 AM

ముదిర

ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చాలి

ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చాలి సమస్యల పరిష్కారానికి కృషి పెన్షన్లు పెంచేవరకు పోరాటం

సిద్దిపేటకమాన్‌: ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజు పోరాట సమితి (టీఎంపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ముదిరాజ్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ముదిరాజ్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట నిర్వహించామన్నారు. ముదిరాజ్‌ల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. 57ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు కేటాయించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లకు అవకాశం కల్పించాలన్నారు.కార్యక్రమంలో అశోక్‌, నీవన్‌, రమేశ్‌, రంజిత్‌, శేఖర్‌, శ్రీశైలం, నరేశ్‌, దత్తు తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్‌

సిద్దిపేటజోన్‌: జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్‌, కార్యదర్శి విక్రమ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పబ్లిక్‌ సర్వెంట్స్‌ హోంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో వారు పాల్గొన్నారు. కష్టపడి పనిచేయాలని, అధికారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహిపాల్‌రెడ్డి, కార్యదర్శిగా కనకరాజు, అసోసియేట్‌ అధ్యక్షుడిగా నాగేందర్‌, కోశాధికారిగా జహంగీర్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు అశ్వాక్‌, శశిధర్‌, తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌: దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్‌ డబ్బులను పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి మంద కుమార్‌ అన్నారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించనున్న పెన్షన్‌దారుల ‘మహా గర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో పెన్షన్‌దారుల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన మంద కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా వృద్ధుల పెన్షన్‌ రూ.4వేలకు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ‘మహా గర్జన’కు పెన్షన్‌దారులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు మైస రాములుమాదిగ పాల్గొన్నారు.

వికలాంగుల

సంక్షేమం పట్టని సర్కార్‌

మిరుదొడ్డి(దుబ్బాక): వికలాంగుల సంక్షేమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విస్మరిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంద కుమార్‌ మాదిగ, జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు విమర్శించారు. ఆదివారం మిరుదొడ్డిలో వీహెచ్‌పీఎస్‌ (వికలాంగుల హక్కుల పోరాట సమితి) సీహెచ్‌పీఎస్‌ (చేయూత పెన్షన్‌ దారుల హక్కుల పోరాట సమితి) సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో ఉన్న 45 లక్షల పెన్షన్‌దారులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకతప్పదన్నారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్‌లో తలపెట్టిన వికలాంగులు, చేయూత పెన్షన్‌దారుల మహా గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్‌ దుబ్బాక నియోజకవర్గం ఇన్‌ఛార్జి రాజేశ్వర్‌రావు, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు శాంతికుమార్‌, నాయకులు రాములు, రాజనర్సు, అంజయ్య, వెంకటేశం, ఎల్లయ్య, మల్లయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్‌లను  బీసీ ఏ లోకి మార్చాలి 
1
1/2

ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చాలి

ముదిరాజ్‌లను  బీసీ ఏ లోకి మార్చాలి 
2
2/2

ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement