
కిటకిటలాడిన నాచగిరి క్షేత్రం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచారం గుట్ట నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తజనులతో రద్దీగా మారింది. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించారు. గర్భగుడిలో విశేషాలంకృతులై కొలువుదీరిన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల తాకిడితో క్యూలైన్లు రద్దీగా మారాయి. ఇబ్బంది తలెత్తకుండా ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
నాచగిరీశుని దర్శించుకుంటున్న భక్తులు