
పాపన్న ఆశయాలు సాధిద్దాం
మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్
చిన్నకోడూరు(సిద్దిపేట): నాడు కులవృత్తులను ఏకం చేసిన గొప్పవ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం గోనెపల్లిలో గౌడ సంఘం, కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం పోరాటం చేసిన పాపన్న గౌడ్ ఆదర్శనీ యుడన్నారు. ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పాపన్న గౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చామన్నారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సిద్దిపేటజోన్: సాక్షాత్తు పార్వతీదేవి మట్టితో వినాయకుడికి జీవం పోసింది. అలాంటి మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తేనే భక్తి, శక్తి లభిస్తుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అమర్‌నాథ్ సేవా సమితి సేవలు ఆదర్శంగా ఉన్నాయని కితాబిచ్చారు. మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదామన్నారు. ఇటీవల పట్టణంలో ఇష్టానుసారంగా చెట్లను నరుకుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.