
శాఖల మధ్య సమన్వయ లోపం
పారిశుద్ధ్య నిర్వహణను వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుంది. వర్షా కాలానికి వారం రోజుల ముందే సమావేశం ఏర్పాటు చేసుకొని తగిన ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంది. డ్రైనేజీల శుభ్రత, పైప్‌లైన్ల లీకేజీ, వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి. వ్యాధులు ప్రభలే అవకాశమున్న చోట దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. కానీ ఆయా శాఖల సమన్వయ లోపంతో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.