
పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సు
ిసిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో త్వరలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఓయూ వైస్ చాన్స్‌లర్ మొలుగురం కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓయూ పీజీ కళాశాలను ఓయూ బృందం పతినిధులు సందర్శించారు. కళాశాలలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఓయూ ప్రతినిధుల బృందం కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఓయూ పీజీ కళాశాలలోని సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితెందర్ కుమార్ నాయక్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, మౌలికసదుపాయాల డైరెక్టర్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి, యూనివర్సిటీ పీజీ (ఓయూ) కళాశాల సమన్వయకర్త డాక్టర్ రవినాథ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఓయూ వైస్ చాన్స్‌లర్
ప్రొఫెసర్ మొలుగురం కుమార్