
హౌసింగ్ ఏఈ సస్పెన్షన్
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న మేసీ్త్ర నుంచి డబ్బులు డిమాండ్ చేసిన హౌసింగ్ ఏఈ వెంకయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ మండలం వెంకటాపూర్‌లో ఇళ్లు నిర్మిస్తున్న మేసీ్త్రని ఏఈ డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై ఈనెల 20న ‘ఇందిరమ్మ ఇళ్లలో అధికారుల చేతివాటం’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టాల్సిందిగా జెడ్పీ సీఈఓ రమేశ్‌ను ఆదేశించారు. నివేదిక ఆధారంగా ఏఈని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ వచ్చే నెల 13న నిర్వహించనున్నట్లు, ఇందులో అధిక మొత్తంలో కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌పర్సన్ సాయిరమాదేవి తెలిపారు. జిల్లా కోర్టు భవనంలో ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్స్, స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంకు మేనేజర్లతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ పడే కేసులన్నీ లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
గోదారి గలగలలు
మల్లన్న సాగర్‌లోకి కొనసాగుతున్న పంపింగ్
తొగుట(దుబ్బాక): మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అధికారులు ఈ నెల 19న రెండు మోటార్ల ద్వారా పంపింగ్ ప్రారంభించారు. రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని రెండు మోటార్ల ద్వారా పంపింగ్ కొనసాగింది. శుక్రవారం మరో నాలుగు మోటార్ల ద్వారా పంపింగ్‌ను ప్రారంభించారు. ఆరు మోటార్లతో రోజుకు 7,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్‌రావు తెలిపారు.
కొమురవెల్లి(సిద్దిపేట): యూరియా కోసం బారులు తీరి సమయం వృథా చేసుకోవద్దని ఏడీఏ రాధిక సూచించారు. శుక్రవారం కొమురవెల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో ఇఫ్కో ప్రతినిధులతో కలిసి నానో యూరియాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క యూరియా బస్తా.. నానో యూరియా 500 ఎంఎల్‌తో సమానమని తెలిపారు. నానో యూరియాను పిచికారీ చేసుకోవాలని సూచించారు. దీంతో పంటలు ఏపుగా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో మేనేజర్, ఏఓ, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్లొన్నారు.
సిద్దిపేటరూరల్: నూతన గ్రామ పంచాయతీలకు రూ.2.60 కోట్లు మంజూరు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం నారాయణరావుపేటలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ శేఖర్‌రావుపేట పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, జక్కాపూర్‌లో అంగన్‌వాడీ సెంటర్‌కు రూ.16 లక్షలు కేటాయించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే మరోవైపు బీఆర్‌ఎస్ నాయకులు తప్పడు ఆరోపణలు చేయడం తగదన్నారు.

హౌసింగ్ ఏఈ సస్పెన్షన్

హౌసింగ్ ఏఈ సస్పెన్షన్

హౌసింగ్ ఏఈ సస్పెన్షన్

హౌసింగ్ ఏఈ సస్పెన్షన్