
భక్తులకు ఇబ్బందులు రావొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం స్థానిక పోలీసులకు సూచించారు. బుధవారం ఆలయంలోని గంగిరేణిచెట్టు ప్రాంగణం, సాధారణ, వీవీఐపీ దర్శనం తదితర ప్రదేశాలతో పాటు కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌ను చేర్యాల సీఐ శ్రీనుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జేబుదొంగలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ మమ్మురం చేయాలన్నారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసి గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డుప్రమాదాల వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేస్తూ ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని అన్నారు. అనంతరం చేర్యాల మండలం గురిజకుంట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
మద్దూరు(హుస్నాబాద్): అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందికి సూచించారు. బుధవారం మద్దూరు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు ఎస్‌ఐ షేక్ మహబూబ్‌లు ఏసీపీకి పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలన్నారు. అనతంరం ఏసీపీని జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపకులు కొత్తపల్లి సతీష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీపీ సదానందం
కొమురవెల్లి మల్లన్న ఆలయ సందర్శన
శాంతిభద్రతలపై సిబ్బందికి సూచనలు