
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించండి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. ఎండల్లో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులను వర్షం, గాలి దుమారం ఆగమం చేసింది. రోజుల తరబడి మార్కెట్‌లోనే ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కుప్పలన్నీ నీటి కాలువల్లో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కుప్పలపై కప్పిన ప్లాస్టిక్ కవర్లు సైతం కొట్టుకుపోయి ధాన్యమంతా నీటి పాలైంది. భారీ నష్టం జరగడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. అక్కెనపల్లి లోని ఆయిల్‌పామ్ తోటను మంగళవారం డీపీఓ దేవకీదేవి, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. 11 నెలల్లో 26 టన్నుల దిగుబడి రావడంతో రూ.4 లక్షల 60 వేల ఆదాయం వచ్చిందని రైతు నాగేంద్రం చెప్పడంతో ఆయనను అభినందించారు. మిగతా రైతులు కూడా ముందుకు వచ్చి ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలన్నారు. నర్మేటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నంగునూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు, సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల రికార్డులను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా చేపట్టాలని అధికారులను సూచించారు. పాలమాకుల ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, నిర్వహకులతో మాట్లాడారు. ఆమె వెంట హౌసింగ్ డిప్యూటీ ఈఈ శంకర్, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప, గీత, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, మౌని, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అకాల వర్షానికి తడిసిన ధాన్యం