బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి

May 14 2025 8:06 AM | Updated on May 14 2025 8:06 AM

బెజ్జ

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి

బెజ్జంకి(సిద్దిపేట): మండల తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి మంగళవారం బదిలీపై వచ్చారు. ఇక్కడి తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి మిరుదొడ్డి మండలానికి బదిలీ అయ్యారు. సిద్దిపేట రూరల్‌ తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకట్‌రెడ్డిని బెజ్జంకి బదిలీ చేశారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్‌రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీటీ గోపాల్‌, ఆర్‌ఐ సంతోష్‌, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు.

కాళేశ్వరంతో

చెరువులు నింపండి

చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటితో మండల పరిధిలోని చెరువులు, కుంటలు నింపాలని రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్‌ ఎస్‌ఈ బస్వరాజ్‌, ఈఈ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అనంతసాగర్‌లోని అప్పలాయ చెరువు, లింగాయకుంట కలుపుతూ కాలువ నిర్మించాలని, దీంతో చెరువు, కుంటల్లో నీరు నిండి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అధికారులు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి మద్దతుగా బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్‌ గౌడ్‌, జిల్లా నాయకులు మడిపల్లి బాపయ్యలు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పాలిసెట్‌

నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లోమా, వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం మంగళవారం నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట ఐదు, గజ్వేల్‌లో మూడు కలిపి మొత్తం ఎనమిది సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా సిద్దిపేటలో 2,606 మందికి 2,467 మంది విద్యార్థులు హాజరయ్యారు. గజ్వేల్‌లో 1,195 మందికి 1,129 మంది పరీక్ష రాశారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల కన్వీనర్‌, రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, రెండు వారాల్లో ఫలితాలు వెళ్లడి అవుతాయన్నారు. అన్ని సెంటర్ల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లను సీజ్‌ చేసి మూల్యాంకన కేంద్రాలకు పంపించామని చెప్పారు.

పంట మార్పిడితో

సుస్థిర ఆదాయం

ములుగు(గజ్వేల్‌): రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అన్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లి, అచ్చాయిపల్లి, కొత్తూరు గ్రామాల్లో మంగళవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రశాంత, వాణిశ్రీ, మధుబాబు, పల్లవి, లతీఫ్‌లు రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సాంకేతిక విషయాలను అవలంబిస్తూ కొత్త వంగడాలను సాగు చేయాలని సూచించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు.

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి 
1
1/3

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి 
2
2/3

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి 
3
3/3

బెజ్జంకి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement