
పులకించిన భక్త జనం..
వైభవంగా దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం
దుబ్బాక: చౌదర్‌పల్లిలో స్వయంభువుగా వెలిసిన పార్వతి దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిఏటా వైశాఖ పౌర్ణమిరోజున స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దుబ్బరాజంశర్మ తెలిపారు. సోమవారం రెండోరోజు ఉత్సవ మూర్తులకు స్నపన తిరువంజన కార్యక్రమం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్య కల్యాణోత్సవం అశేషంగా హాజరైన భక్తుల జయజయ ధ్యానాల మధ్య కనులపండువగా జరిగింది. మంగళవారం స్వామివారి రథోత్సవం జరుగుతుంది.

పులకించిన భక్త జనం..